సిలువ పలుకులు

  • 72 Views
  • 0Likes

    పచ్చా పెంచలయ్య

  • మహమ్మదాపురం, నెల్లూరు
  • 9912822341

లోకపు పాపముబాపను
లోకేశుడు ఏసురాజు లోకుల కొరకై
లోకమునందున సమిధై
లోకంబును వదలివెళ్లె లోకోన్నతుడై
తండ్రీ వీరికి తెలియదు
గాండ్రించియు వీరు జేయుకార్యములేవో
తండ్రీ మీరే వారిని
తండ్రిగ రక్షింపుమనియెదాతగు క్రీస్తూ
నీవు నాతొ గూడ నిజముగ పరదైసు
నందు ఉందువనెను నమ్మకముగ
ప్రక్కనున్నవాని ప్రార్థన వినియును
ఏసునాథుడనియె ఎక్కి ‘‘సిలువ’’
తల్లిని జూచిన తనయుడు
కొల్లగ దుఃఖంబుతోడ కుదురుగ తనతో
మెల్లగ బలికెను, తల్లీ
యిల్లిదిగో, నేను నీకు యిష్టపు సుతుడన్‌
దేవా వదలితివెందుకు
నీవూ నా చేయిననుచు, నిజముగ వ్యథతో
పావన పుత్రుడు క్రీస్తూ
దేవుని అడుగంగసాగె దీనత తోడన్‌
దాహము, దాహంబనుచును
దేహపు ధర్మంబుతోడ దేవుని సుతుడూ
ఆహుతి ముందుగ అడిగెను
బాహాటముగానె సిలువ బంధమునందున్‌
సామాప్తమైన దనియెను
సమయంబాసన్నమైన సంగతి నెరిగీ
కమనీయ దైవ పుత్రుడు
అమలంబగు ప్రేమతోడ, ఆర్ద్రతతోడన్‌
నాదు ఆత్మను మీకిస్తిననుచు యేసు
తండ్రితోడుల్‌ చెప్పియు తలను దించి
ప్రాణమిడచెను సిలువపై పావనుండు
చీకటులు క్రమ్మె లోకాన, చింత ప్రబలె
తిరిగియు మూడవరోజున
నరరూపాధారియైన నజరేయుండూ
ధరపై లేచియు కనబడె
పరమానందంబునొంద ప్రజలందరునూ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌