అసలు నాకేమొచ్చు?

  • 191 Views
  • 2Likes

    భవాని ఫణి

  • బెంగళూరు,
  • 9441555402

ఆకాశప్పడవ మీద అక్షరాల్తో
తెడ్లు వేస్తూ
అంతరిక్షంలోకి అలవోకగా
తీసుకెళతారు వాళ్లు
ఎక్కినప్పుడల్లా ఉలికిపాటే...
అసలు నాకేమొచ్చు?
రంగురంగుల మబ్బుల్లోంచి
పదాల్ని దులిపి
చెట్టు చెట్టుపైనా చిత్తడి
తివాచీలు పరుస్తారు వాళ్లు
తడిసిపోతూ తడబడతాను... 
అసలు నాకేమొచ్చు?
నల్లని ఖాళీ కాగితంపైకి 
మిణుగురుల్ని విరజిమ్మి
వింతవింత ముగ్గులుగా
వెలుగుతుంటారు వాళ్లు
మెరిసే కనుపాపలతో కలవరపడతాను...
అసలు నాకేమొచ్చు?
పలుచని పూలరెక్కలపై పరుచుకున్న
నీరెండలా
వెచ్చని అనుభూతుల్ని
ప్రసరిస్తారు వాళ్లు
విరబూసే హృదయంతో వ్యథ
చెందుతాను... అసలు నాకేమొచ్చు?
అమ్మ చిలికిన వెన్నముద్దలా
కరిగిపోయే
వారి మెత్తని కవనాల రుచికి
అబ్బురపడుతూ
నేను సృష్టించిన బండరాళ్ల వైపు
బెంగగా చూసుకుంటాను... అసలు
నా.. కేమొచ్చు!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి