వృక్షో రక్షతి రక్షితః

  • 512 Views
  • 17Likes

    కంచనపల్లి ద్వారకనాథ్‌

  • తిరుపతి.
  • 9985295605

ఒక మొక్క నిత్యం ఆకలి తీర్చే
గింజైనప్పుడు అన్నపూర్ణలా కనబడింది
ఒక చెట్టు వంటచెరకై తాను కాలుతున్నప్పుడు
త్యాగశీలిలా కనబడింది
ఒక చెట్టు ఆకు భోజన పళ్లెమైనప్పుడు
ప్రకృతి దేవత హస్తంలా కనబడింది
ఒకచెట్టు బట్టనిచ్చినప్పుడు
వస్త్రదానం చేసిన దాతలా కనబడింది
ఒక చెట్టు నా ఇంటి తలుపు అయినప్పుడు
రక్షకభటుడిలా కనబడింది
ఒక చెట్టు నీడనిచ్చినప్పుడు
వనదేవతలా కనబడింది
ఒక చెట్టు ఆక్సిజన్‌ వదులుతున్నప్పుడు
ప్రాణదాతలా కనబడింది
ఒక చెట్టు పళ్లు అందించినప్పుడు
శక్తిప్రదాతలా కనబడింది
ఒక చెట్టు పుష్పాలు దేవునికి అర్పించినప్పుడు భక్తురాలిగా కనబడింది
ఒక చెట్టుగింజ తైలమై దీపం వెలిగించినప్పుడు
చీకట్లను పారద్రోలే జ్ఞానిలా కనబడింది
ఒక చెట్టు పిట్టగూటికి ఆశ్రయమిచ్చినప్పుడు
బిడ్డను లాలించే తల్లిలా కనబడింది
ఒక చెట్టు కొయ్యపడవగా మారి నీటిపై
ప్రయాణిస్తున్నప్పుడు అమ్మఒడిలా కనబడింది
ఒక చెట్టు పశుపక్ష్యాదులకు ఆహారమైనప్పుడు
కల్పవృక్షమై కనబడింది
ఒక చెట్టుగుజ్జు కాగితమై పుస్తకంగా మారినప్పుడు
సరస్వతి దేవిలా కనబడింది
ఒక చెట్టుకొమ్మ కొయ్యబొమ్మగా మారినప్పుడు
కళామతల్లిగా కనబడింది
ఒకచెట్టు కొమ్మ వృద్ధుడి చేతకర్ర ఊతైనప్పుడు
పసిబిడ్డని నడిపించే తండ్రిలా కనబడింది
ఒక చెట్టు కట్టెలు పార్థివ దేహాన్ని 
దహనం చేస్తున్నప్పుడు తనలో
ఐక్యం చేసుకొనే దేవతలా కనబడింది
ఒక పచ్చని చెట్టుపై గొడ్డలి పెట్టు పెడుతున్నప్పుడు
బలిపశువై కనబడింది
ఒక మొక్క నాటేటప్పుడు
అభయహస్తం ఇస్తున్న దేవతలా కనబడింది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌