పల్లవి
సత్యాగ్రహం.. ఇది సత్యాగ్రహం
సత్యాగ్రహం.. ఉప్పు సత్యాగ్రహం //2//
చరణం1
కొల్లాయే దేహానికి
చిరునవ్వే తన మోముకి //2//
చేతి కర్ర సాక్షిగా
సాగిందిరా... ఇది సాగిందిరా.. //సత్యాగ్రహం//
చరణం 2
మన దేశం కోసమని
స్వాతంత్ర్యం తన శ్వాసని //2//
సబర్మతి ని మొదలుకొని
సాగిందిరా... ఇది సాగిందిరా.. //సత్యాగ్రహం//
చరణం 3
దండి లోని ఉప్పు వండి
తన నిరసన తెలిపెనండి //2//
సకల జనుల నైక్య పరచి
సాగిందిరా... ఇది సాగిందిరా.. //సత్యాగ్రహం//