ప్రకృతి చిత్రం

  • 197 Views
  • 4Likes

    సి ఎస్‌ రాంబాబు

  • సికింద్రాబాదు
  • 9490401005

నల్లటి రేగడి మబ్బుల్ని
అద్దుకున్నట్టు
కొత్తగా మెరిసిపోతోంది ఆకాశం!
భానుడికి సెలవు దొరికినట్టుంది
అరుణోదయ కాంతి
కాస్త విశ్రాంతి తీసుకుంటోంది!
వరుణుడి కరుణకు
పరుగులు తీస్తోంది
కారు మొయిలు ఆకాశం
పచ్చదనం మొక్కై
మొలచిన చోటల్లా
వెండి చినుకుల
వాన జలతారుని పంపుదామని!
గాలి అల ఒకటి
తాకినప్పుడల్లా
ఆనందాన్ని ప్రకటిస్తూ
ఆ చెట్లు
కృతజ్ఞతతో
పూల పారాణిని
నేల తల్లికి అద్దుతున్నాయి!
మట్టి పరిమళమేదో
గాలి తరకొకటి మోసుకొచ్చినట్టుంది
పరిమళమిచ్చిన మైకంతో
గిరికీలు కొడుతూ
పావురాల సమూహమొకటి!
వర్షర్తువు విన్యాసంతో
కొత్త ఆకృతితో
ప్రకృతి ఇప్పుడు
చిత్రకారుడు గీసిన
కొంగొత్త చిత్తరువు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌