నాకు దొరికాను నేను

  • 295 Views
  • 0Likes

    - సిరిమువ్వ

  • బండిఆత్మకూరు, కర్నూలు,
  • 8464048293

అమ్మతోనే మొదలయ్యింది నా ప్రేమ
అక్షరంలా దానికీ అంతం లేదు.
విశ్రాంతి తప్ప విరామం లేదు.
తొలకరి చినుకుల్లాంటి ప్రేమ కురిస్తే
మట్టిలా మధురంగా పరిమళిస్తాను.
మేఘాలెన్నో నాలో చేరితే
ఆకాశంలా ఆనందిస్తాను, ఆరాధిస్తాను.
సుదూరాలకు సాగిపోతున్నా
నా గమ్యం నాలోనే.
వెతుక్కుని వెతుక్కుని నాలో లేనని తెలిసి
అలసిపోతాను.
ఓ చిన్నారి చిరునవ్వు, చెట్టునీడ.
అలసట మరిచిపోయి సేదతీరుతాను.
ఆ దారి మలుపులో ఉన్న ఊటబావి స్నేహమనే అమృత జలాన్నిచ్చి
దాహం తీరుస్తుంది.
గగన సీమ నుంచి గువ్వలు కొన్ని
ప్రేమనే జొన్నపొత్తులు తెచ్చి కడుపు నింపుతాయి.
మళ్లీ నా ప్రయాణం మొదలు
నా నుంచి
నా కోసం
నా దాకా
ఆద్యంతాలు లేని నేను
ఎక్కడ దొరుకుతాను నాకు.
మార్గం మధ్యలో నిశ్చలంగా నిలబడి
నిజాన్ని స్మరిస్తే,
చెట్టునీడ, ఊటబావి, గువ్వలు గుర్తుకొచ్చాయి.
శోధన వెతుకులాట సమాప్తం
మీ నవ్వుల్లో 
స్నేహాల్లో
ప్రేమల్లో నేనే కదా ఉన్నది.
మరి నేనంటే మీరే కదా
అవును నాకు దొరికాను నేను మీలో
మిమ్మల్ని వదలను.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


 కరోనా విలయం

 కరోనా విలయం

సాహితీసుధ


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌