మల్లెమొగ్గ

  • 93 Views
  • 0Likes

    జి.రామకృష్ణ

  • భూదాన్‌ పోచంపల్లి, నల్గొండ
  • 8977412795

ఏటి ఒడ్డున
ఒంటికాలుపై నిలబడ్డ కొంగని
తలకిందులుగా చూస్తున్నట్టు
చెవి మహారాణికి చెలికత్తెలా
ఆ ముత్యపు లోలాకు
ఆమె చెవికి వేలాడుతున్న
పాలబొట్టులా
తెల్లగా ఊగుతూ ఊగుతూ
దృష్టిలోగిలిలో ఒలికిన శ్వేత గంధం
గుండెనిండా గుప్పెడు ఊహలు
గుమ్మరించిన
ఆ తుంటరి
రాత్రిళ్లు పరుచుకున్న పక్కమీద
అటూఇటూ దొర్లుతూ
నల్లని నిద్ర నలిపేసి
కవిత్వమై పూసిన మల్లెమొగ్గ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


వాన

వాన

తానా మూర్తి


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


స్మృతులుగా తెగిపడుతూ...!

స్మృతులుగా తెగిపడుతూ...!

సిరికి స్వామినాయుడు


సీతాకోక చిలుక

సీతాకోక చిలుక

ఎస్‌.ఆర్‌.భల్లం


కవి పద విరమణ

కవి పద విరమణ

గొల్లపెల్లి రాంకిషన్‌