మరో విత్తు

  • 40 Views
  • 0Likes

    వేంకటరమణ వెలపర్తి

  • హైదరాబాదు.
  • 9642909370

కాంక్రీట్‌ జంగిల్‌ అవతల
అప్పుడెప్పుడో నేనే బ్రహ్మనై
నీకు జీవం పోశాను
నువ్విప్పుడు నాకే అందనంత
ఉన్నతంగా ఎదిగావు
ప్రేమపక్షులకు ప్రేమావాసమై
వలస పక్షులకు స్థిరనివాసమైనావు!
నాడు నీ ఆకలి తీర్చమని నా వంక
బేలగా చూసిన నువ్వు నేడు
పూటగడవని వాడి ఆకలి
తీరుస్తున్నావు!
భాస్కరుడి తీక్షణ వీక్షణాలు
మనిషిని నిలువునా దహించివేస్తుంటే
ఆ తాపాన్ని
చల్లార్చే లేపనమవుతున్నావు!
విషవాయువులను నువ్వు పీల్చి
మా ప్రాణాలు నిలబెడుతూ
ఆ గరళకంఠుని తలపిస్తున్నావు
గ్యాస్‌ గుదిబండ మోయలేని
పేదవాడికి ఇంధనం అవుతున్నావు
నగరీకరణం పేరుతో నీ ఊపిరి
తీయాలని ప్రయత్నిస్తున్నా 
మౌనంగా భరిస్తున్నావు!
పదునైన గొడ్డలి దెబ్బకు నీ దేహం
ఛిద్రమై నువ్వు కార్చే కన్నీళ్లే
సంద్రంగా మారి మా పాపాల
ఒత్తిడికి
అది సునామీ కెరటంలా ఈ లోకాన్ని
ముంచెత్తక ముందే నేను ఏదో ఒకటి
చేయాలి? ఏం చేయగలను?
మరో విత్తు నాటడం తప్ప!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి