పున‌ర‌పి...

  • 28 Views
  • 0Likes

    ఎన్‌.వి.రత్నశర్మ

  • హైదరాబాదు.
  • 9866376050

బంధాలన్నీ
పండుటాకుల్లానో
పూరేకుల్లానో
వాడిపోయి రాలిపోతుంటే
జారిపోతున్న బంధాలతో
ఒంటరి బాటసారైన మనిషి
శిథిలమవుతున్న పూతీగ!
కళ్ల దొరువుల్లో
వట్టిపోతున్న కన్నీటి చెలమలు
జీవితానికి కొత్త అర్థం చెబుతుంటయ్‌.
కాల ప్రవాహపు వంతెనకు
పుట్టుక ఒక కొన
చావు రెండో కొన
ఈ దరి బయలుదేరింది
ఆ దరికి చేరుకోటానికే అయినా
వేసే ప్రతి అడుగుకూ
రెండో కొనకు
దగ్గరవుతున్నామనుకోరు
అట్లా అనుకుంటే
రెండో అడుగే పడదు!
భ్రమల భ్రమణాల మధ్య
ఆశాజీవి మనిషి!
ఇప్పుడిక్కడ
ఒక బంధాన్ని తెంపుకోవటం
ఎక్కడో 
మరో బంధానికి పురుడు పోసుకోటానికే,
పునరపి జననం!
పునరపి మరణం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి