రాగమాలికలు

  • 142 Views
  • 0Likes

    డా।। అన్నపురెడ్డి శ్రీరామరెడ్డి

  • గుంటూరు.
  • 9490776238

అశల ఆకాశంలో విహరించే
మనో విహంగం....
సమస్యల గ్రీష్మం విసిరిన
వడగాలి దెబ్బకు-
మట్టికరచినప్పుడు....
స్పందించే మట్టికణాల
గుండె లోతుల్నుంచి
మానవత్వం ఉబికి వస్తుందని-
ముళ్లమధ్య బతికే
గులాబీరేకుల గుసగుసలు
వింటే తెలుస్తుంది..
ఆ గులాబీల గుణరత్నాల
నయనాలనుంచి ప్రవహించే
కాంతిధారల దారుల్లో
పయనించే జీవితనౌక
అంతరంగాల తరంగాలపైన
గమ్యం చేరినప్పుడు-
తీరాల పెదవులపైన
పచ్చని నవ్వులు ప్రతిఫలిస్తాయని
కవికోకిలలల్లిన రాగమాలికలు
రవళించును, పరిమళించును
మది - వీణియలై, నవవేణువులై!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు