తెలుగుదనానికి బాపు

  • 307 Views
  • 1Likes

    ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

  • అమెరికా.

గీత ఆయన రాసీరాయని కవిత
కవిత ఆయన గీసీగీయని బొమ్మ
ఆయన సగటు తెలుగింటి అందాల బ్రహ్మ
తెలుగు ముంగిట్లో అల్లుకొన్న
సన్నజాజి రెమ్మ
చదువుగుమ్మం తొక్కిన
తొలిచక్కదనాల అమ్మ
పేరుమరచి తెలుగుదనం బాపూ! అని పిలుచుకొన్నా...
నవయవ్వన చిత్రకళకు నాన్న,
సత్తిరాజు లక్ష్మీనారాయణ
తెలుగుసొగసు 
ఆయన చూపుతో కాటుక దిద్దుకొంది
గీతతో 
ఆధునికతాభాష్యం నేర్చుకొంది
ప్రబంధం వారి పదారేళ్లపడుచు
పాతికేళ్ల పిల్లగా మారింది
తమలపాకు చిలకలు చుట్టి కళ్లతో
తినిపించింది
‘అస్తిన్నాస్తి... శాతోదర... విచికిత్స’ను
శ్రీనాథుడికి నేర్పించింది
ఏవీకే పుణ్యమా అని
అష్టవిధ నాయికలు
కందుకూరి జనార్దనాష్టకపొత్తంలో కాపురం
పెడితే
రసిక హృదయాలపై నడిరాత్రి
అట్టవిప్పుకొని పవ్వళించారు
రమణగారి రెండుజెళ్ల సీతతో
ఆడుకొన్న బుడుగూ బుజ్జాయిలు
మండువా లోగిట్లో విసనకర్ర
విసురుకొంటున్న బామ్మలూ
తాతయ్యలు
ఆవకాయ ఘాటుల్తో అమరేంద్రుడి
రాత మార్చిన భానుమతి అత్తయ్యలు
రామయ్యను గన్న గుహులూ,
శబరమ్మలూ
ఇవ్వాళ ఆయన చుట్టూ మూగారు
కుంచె లేకుండా నువ్వొక్కడివే
వచ్చావా అని నిలదీస్తున్నారు
‘తెలుగుజాతి నా కుంచె, ఎలా
పట్టుకురాను?’
తడికనుల మౌనభాషలో ఆయన చెబుతూనే 
ఉన్నాడు

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


విసిరేసిన కాలం

విసిరేసిన కాలం

జస్టిస్‌ దామ శేషాద్రినాయుడు


దృశ్యాదృశ్యం

దృశ్యాదృశ్యం

కొప్ప‌ర్తి వ‌సుంధ‌ర‌


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు