తెలుగు లిపి
బహు చిలిపి
సరళరేఖల రారాజు
గీతల గీతమార్చిన సత్తిరాజు
బాపు రేఖలు కలిపి
రేఖలతో చిత్రకారుడు
రీళ్లతో చలన చిత్రకారుడు
చెరగని బాపు గీత
తరగని గిలిగింత
ఘనతలో చరిత్రకారుడు
బాపు బాణీ ‘సాక్షి’తో బోణి
రమణ ప్రాణి సత్తిరాజు వాణి
రెండుగా విడిన తెలుగునేల
బాపు రమణల కీర్తితో వెలుగునేల
ఆణిముత్యాల శ్రీరామరాజ్యం ఆఖరి అలివేణి
ఈ ప్రపంచానికి బాపు సెలవ్
మరో ప్రపంచంలో రమణకి ‘సే’లవ్
బావురుమన్నాడు తండ్రిని కోల్పోయి బుడుగు
బాపు బొమ్మ జడపదార్థమైంది పడక అడుగు
వారి స్నేహంపై దేవుడా నువ్వే సినిమా తీయగలవ్
మీ గీత ఘంటసాల పాడలేనిది
మీ సీత వాల్మీకి కనలేనిది
వెలవెలబోయిన వెండితెర
కళతప్పిన బాపు బొమ్మల పరంపర
మీ చేత ఇహలోకంలో సాటిలేనిది