బంగారుతల్లి - శ్రీ కనకదుర్గ!

  • 134 Views
  • 1Likes

    కళ్యాణశ్రీ (జంధ్యాల వేంకటరామశాస్త్రి)

  • హైదరాబాదు.
  • 9640321630

శ్రీ పరాదేవి! ప్రణవేశ్వరీ! త్రినేత్రి!
శిష్ట రక్షా పరాయణి! దుష్ట దమని!
కరుణ వర్షిణీ! ‘‘కళ్యాణ కనకదుర్గ’’!
శాంకరీ! జగదీశ్వరీ!! జయములిమ్ము!!

ధరణిలో - అవినీతి దనుజుల - ‘‘దుర్ముఖా’’-
    ధముల నణచ రమ్ము! ‘‘ధర్మగాత్రి’’!!
రక్త పిపాసులౌ - ‘‘రక్త బీజా’’దుల -
    శిక్షింపగను రమ్ము - ‘‘శ్రీ భవాని’’!!
స్వార్థపు కోరల - ‘‘చండ ముండా’’దుల -
    చెండాడ రమ్ము - ‘‘చాముండి దేవి’’!!
దేశ సంక్షభులై - తిరుగు - ‘‘శుంభా’’దుల -
    దునుమాడగను రమ్ము - ‘‘దురితహారి’’!

అవని ధర్మ భక్షకులు - ‘‘మహిషాసురా‘‘ధ’’
ములను - మట్టుపెట్టగ రమ్ము - ‘‘మోక్షదాత్రి’’!
సకల లోక కళ్యాణి!! ‘‘శ్రీచక్రరాజ్ఞి’’!!
‘‘శ్రీ కనకదుర్గ’’ చరణాలె - శ్రీ పదాలు!!

ముజ్జగాల - ‘‘బంగరు ఒడి’’ - మురిపెమొలుక,
కరుణ తోడ లాలించు - శ్రీ కల్పవల్లి!!
భక్తజనుల చల్లగసాకు - పాలవెల్లి!!
‘‘శ్రీ జగన్మాత’’ పాదాలె - శ్రీకరాలు!!

‘‘అన్నపూర్ణ’’వై - రైతుల నాదుకొనుమ!
‘‘భరతమాత’’ - శాంతి సుధల - పరిఢవిల్ల
‘‘తెలుగునేల’’ - సువర్ణ కాంతుల విరియగ -
‘‘స్వర్ణ దుర్గాంబ!’’ - మమ్ముల సాకుమమ్మ!!

‘‘సర్వమంగళ!’’ త్రిభువనేశ్వరి! శుభకరి!
భక్త హృదయ సరసున - భవ్యగతి - ‘‘స్వర్ణ’
‘‘హంస’’పై - విహరించెడి - ‘‘అమృత తల్లి’’!
కరుణ బ్రోవుమా! మమ్ము - ‘‘బంగారుతల్లి’’!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు