ఆకుపచ్చని కల

  • 208 Views
  • 4Likes

    డా.నల్లపనేని విజయలక్ష్మి

  • గుంటూరు.
  • 9701667350

ఆకుపచ్చని సముద్రంలో అలనవ్వాలని
కలగంటానా?
కడగవలసిన గిన్నెలు గలగల నవ్వుతాయి
మేలుకొలుపు రాగాన్ని వినిపిస్తాయి

పున్నాగ పారిజాత పరిమళాలలో
పరవశించిపోదామని పరిగెడతానా?
నిను వీడని నీడను నేనంటూ
పోపు వాసన పకపకలాడుతుంది

విరిసిన పూబాల సోయగాన్ని
ఎదలో పదిలం చేసుకోవాలనుకుంటానా?
మది తలుపులు మూసేసి
మా సంగతి చూడమంటూ
మాసిన బట్టలు మౌనంగానే
గుడ్లురుముతాయి

శిశిరం నుంచి వసంతానికి
వసంతం నుంచి శిశిరానికి
పయనమే సృష్టి ధర్మమని
మారని దేది లేదని తెలుసుకొని
మారవలసింది నువ్వేనని
కొమ్మల చేతులతో వింజామరై వీస్తూ
మొక్కవోని ధైర్యాన్ని ప్రాణశ్వాసను చేసే
నిలువెత్తు నీడ సాహచర్యాన్ని కోరుకుంటానా?

ఎంత దూరం పయనించినా
నీ చివరి మజిలీ నేనేనంటూ
అమ్మతనాన్ని వదలలేని నీకు
శాశ్వత సహచరిని నేనేనంటూ
ఆకుపచ్చని కలలు కనడం మాని
నా ఆమరణాంతపు కౌగిలిలో కరిగిపోమ్మంటూ
వంట గది విలాసంగా హితబోధ చేస్తుంది
అలవోకగా ఆశలకు సమాధి కట్టడం నేర్పిసుంది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు