అక్షరాలు

  • 363 Views
  • 4Likes

    మల్క జనార్ద‌న్‌

  • భీమ్‌గల్, నిజామాబాదు.
  • 9866159005

అక్షరాలు అంటే
నేర్చుకొని వదిలేయడం కాదు
జీవితానికి వెలుగునిచ్చి
రాచబాట పరచిన
కుసుమాలు..
బతుకు వేదికపై
అక్షర నిర్మాణం జరిగి
జ్ఞాన సముపార్జనకు
చేయూతనిచ్చిన రోజు..
సామాజిక చైతన్యానికి
స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి
చేదోడువాదోడుగా ఉంటూ
అంకురం చేసిన చెదరని శిలాక్షరాలు
బతుకు మార్గానికి
మెతుకు జీవనానికి
ప్రతిబింబించేలా ప్రతిధ్వనిస్తూ
చప్పుడు చేసే గుప్పెడు అక్షరాలు
మానవీయ విలువలకు
సంబంధ బాంధవ్యాలకు 
దిక్సూచిలా పనిచేసే
అక్షర చిగురులు..
అమ్మ ఒడిలో
అమూర్త భావనల భాష
ప్రాథమిక బడిలో 
మూర్త భావనల అక్షర భాష
సొంతంగా ఎదిగి ఒదిగేందుకు
ఆ అక్షరాలు అమృత కలశం..
అక్షరాలు అంటే
ఆషామాషి వ్యవహారం కాదు
తమస్సు తొలగించి
ఉషస్సు కలిగించే
జ్ఞాన వీచికలు
విజ్ఞాన గీతికలు
జీవితాంతం వెన్నంటి ఉండే
ఆశల మణిహారం
ఆశావాహులకు సమగ్ర సమాహారం
అక్షరాలు అంటే
క్షీణించని పదాలు
మనసులో నిలిచే పదాలు
భవిత మయూఖానికి మరో క్షీరదాలు

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు