పట్టెడ

  • 90 Views
  • 0Likes

    కోటం చంద్రశేఖర్

  • మహబూబ్‌నగర్‌.
  • 9492043348

మిత్రుని ఫోన్‌కాల్‌తో
బైటికెళ్తూ గబుక్కున ఆగాను-
పట్టెడ; ఐదు గజ్జెల పట్టెడ కిందపడి ఉంది
అల్మారానుంచి-
ఏ కొత్తబట్టలు తీస్తుంటే
ఏ సర్టిఫికెట్లు చూస్తుంటే పడిందో ఏమో?
పట్టెడ-
మెడకి
అలంకరించే ఆభరణం కాదది
ఒక్క మెరిసే ఆభరణమే కాదు
ఆ పట్టెడ మామూలుది కాదు
కొంత విలువ, ఎంతో పవిత్రతతో-
పాడుభూమిని చదునుచేసి సాగుచేసినట్టు
మమ్మల్ని మా చదువుల్ని లాగించడానికి
నిర్విఘ్నంగా సాగించడానికి
ఎన్నిసార్లు షావుకారి ఇనుప పెట్టెలో బందీ అయ్యిందో            పట్టెడ-
సగం జైలు సగం బెయిలు మాది
కుదుటబడ్డ గోపురం కాదు
కుదవబెట్టే కాపురం-
ఏ అవసరాలు పిల్చినా ఆపద్బంధువైన పట్టెడ
ఏ అరణ్యాలు మొల్చినా ఆయుధమైన పట్టెడ
బంగారు పట్టెడ; అమ్మ మనసును ముద్దాడిన పట్టెడ
సెలయేళ్లైన మా కన్నీళ్లను తుడిచిన పట్టెడ
మా రైళ్లను పట్టాలమీద నడిపి గమ్యాలకి చేర్చిన పట్టెడ
చేతిలోకి తీసుకొని పట్టెడని చూస్తుంటే
కన్నీటి సరస్సులో వికసించిన పద్మంలా అగుపించిన అమ్మ-
బాల్యపుజాడల్లోంచి యవ్వనపునీడల్లోంచి
కరిగిన కలలో మెరిసిన వజ్రంలా కనిపించిన అమ్మ
ఇప్పుడన్నీ ఉన్నాయ్‌; ఉద్యోగం హోదా-
ఇప్పుడన్నీ ఉన్నాయ్‌; ఆస్తి అంతస్తు
లేనిది అమ్మ ఒక్కతే-

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి