గౌతమ బుద్ధుడు

  • 328 Views
  • 0Likes

    పులుగుర్త పార్థసారథి

  • హైదరాబాదు.
  • 9849226869

మానసాంతర జన్మైక వాసనలను
వశము తప్పెడి చంచల భావనలను
పగ్గములనిమిడ్చి నియంత్రపరచినపుడె
సత్య శోధనా ఫలసిద్ధి సాధ్యమనెడి
సత్య దర్శన మాయెను శాక్యమునికి
గాఢ నిష్ఠా గరిష్ఠుడౌ గౌతమునికి!
సాధనల యందు, భావసమాధులందు 
నిత్య పరితృప్తి నందిడు నియతులందు
దివ్యభావానుభూతి ప్రాప్తిలిన యపుడె
సత్య సాంగత్య సంసిద్ధి సాధ్యమనెడి
ధర్మ సూత్రము తోచె తథాగతునికి
భవ్య నిస్తంద్ర తేజో విభాసితునికి!
అలర నష్టాంగ సూత్రము లభ్యసింప
ఆత్మ సంస్కార పాలన నన్వయింప
పారమార్థిక చింతన పర్వినపుడె
సదయ హృదయాంతరంగము సాధ్యమనెడి
సత్య మనుభూతమాయెనీ సాధకునికి
భూరి సత్ఫల సిద్ధుడౌ బోధకునికి!
దైవ మహిమాస్వరూపుడు, దార్శనికుడు
అక్షరానంద నిలయుడు, ధ్యానధనుడు
జ్ఞానయోగి, నిర్వాణ విధాన యోగి
సర్వసంగపరిత్యాగి, సౌమ్య యోగి -
సుగమ మాయెను సర్వమీ శోధకునికి
శిరము వంచెను విశ్వమీ సిద్ధమునికి!
సుగమ జీవన సూక్తులు ప్రగతి గూర్చె
సర్వజన సుఖశాంతి విస్తరిలి తనరె 
సహజ కరుణార్ద్ర భావన సౌరు నింపె
రమ్య సమతా లతాంత సౌరభము పర్వె-
సద్యశోన్నతి యొలసెనీ సద్గురునికి
ధర్మ బోధనా నిరతుడౌ తాత్వికునికి!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


మురళీగానం

మురళీగానం

సుధీంద్ర‌భార్గ‌వ‌