ఆణిముత్యాలు... ఆదర్శ నేస్తాలు

  • 98 Views
  • 0Likes

    విజయ రుద్రరాజు

  • హైదరాబాదు.
  • 8977311737

జాబిలమ్మని చూడగానే
తలపుకొచ్చే జోలపాట
అమ్మనే పిలుపెంతో
మధురమైన వెన్నముద్ద.
నిశిరాత్రి వెన్నెల జడిలో
నా మది మిణుగురై ఎగురుతున్న వేళ,
రూపమెరుగని చిరుగాలికే
ఎదురీదే నా ఊహల గానం.
కసిగా నాపై కత్తి దూసిన కాలమా
ఒక్కసారి వెనక్కి మరలు
ఏరుకోవాలెన్నో మధుర స్మృతులు.
పలకరిస్తాయో, లేదో నా చిరునేస్తాలు.

కోడికూత, వేపపుల్ల, బావినీరు, చద్దిమూట
పైరగాలి, లేగపరుగు, గోధూళివేళ...
అయ్యో, ఎప్పుడనగా వదిలి వచ్చేశాను.
బడి మానేశాక, బతుకు బండిని లాగే పనిలో పడి,
అడుగడుగునీ శాసించే, ఆధునికతకు ఒరవడి,
విధి ఆడే వింతనాటకంలో
మిమ్మల్ని విలువలేని పాత్రని చేసేశాను.
మళ్లీ ఎప్పుడైనా మారాం చేస్తుందేమోనని,
మది గొంతుని కూడా నులిమేశాను.
భారమైన ఈ యాంత్రిక జీవనంలో
ఉడిగిపోతున్న జవసత్వాల మధ్య,
ఎప్పుడైనా తలచుకొంటే, అదో రంపపుకోత.
అప్పుడు... అప్పుడే అనిపిస్తూంటుంది.
ఇవే ఎప్పుడూ పల్లెఒడిలో ఒదిగిపోయే ‘ఆణిముత్యాలని’...
నా ఎదలోతుల్ని వదిలిపోని 
‘ఆదర్శ నేస్తాలని’...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


వాన

వాన

తానా మూర్తి


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


స్మృతులుగా తెగిపడుతూ...!

స్మృతులుగా తెగిపడుతూ...!

సిరికి స్వామినాయుడు


సీతాకోక చిలుక

సీతాకోక చిలుక

ఎస్‌.ఆర్‌.భల్లం


కవి పద విరమణ

కవి పద విరమణ

గొల్లపెల్లి రాంకిషన్‌