గమ్యాన్ని చేరాలి

  • 282 Views
  • 1Likes

    వై. ఉదయ్‌ కుమార్

  • హైదరాబాదు.
  • 8247597726

చెప్పలేని బాధ, చూడలేని వ్యథ
ఎదంతా ఒకటే రొద 
నా గమ్యాన్ని చీకటి మింగేసింది
నిరుత్సాహం నరనరాన్నీ వణికిస్తోంది
ఆకాశంలోకి పక్షములతో ఎగరాలనుకున్న మనసు
నేల మీదే ఆగిపోయింది
నాలుగు గోడల మధ్య నలిగిపోయింది
చాలా అలసిపోయింది
చీకటిని చీల్చే వెలుగు కోసం
వేవేల నయనాలతో ఎదురు చూస్తోంది
చీకటి పొరలతో కప్పబడిన నా గమ్యాన్ని ఇంకా 
వెతుకుతూనే ఉంది
నిస్సత్తువ నిందించిన, సంకెళ్ళతో బంధించిన ఇంకా
వెతుకుతూనే ఉంది
చీకటి కోరల్లో చిక్కుకున్న నా గమ్యం కోసం
లోలోపల కుమిలిపోతున్నది గాని ఆగిపోవట్లేదు
అదిరి పడింది, బెదిరి పడింది, చెదరి పడింది
చాలా సార్లు పడుతూ లేస్తూనే ఉంది.
చీకటిని ఛేదించి, వెలుగుని సాధించి, గమ్యాన్ని
హత్తుకోవాలని
కెరటాల లాగే 
పడినా లేస్తూనే ఉంది మనస్సు. 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ