ప్రపంచాన్ని వెలివేసిన
తెన్నెరుగని తెరువరి నీవు...!
దిక్కులేని దరిద్రానికి
బలమైన బాసట నీవు...!
నీ ప్రతిమాటా
ఓ విషాదపు తూటా....!
నీ ప్రతి అడుగూ
ఓ కన్నీటి మడుగు....!
నిస్తేజమైన నీ కళ్లు
ఆక్రందనల లోగిళ్లు
మండుతున్న నీ మనసు
మరుగుతున్న లావాగ్ని
దాగని నీ అశక్తత
దహిస్తున్న దావాగ్ని
నీ ఉజ్జ్వల భవిత
సుదూర మరీచిక
నీ ప్రతి కదలిక
మానవాళికి ఓ ప్రహేళిక