నన్ను పలికించిన మనసు

  • 431 Views
  • 2Likes

    డాక్టర్‌ సి.నారాయణరెడ్డి

  • హైదరాబాదు

ఈ పూట నిశ్శబ్దంగా ఉండాలనుకున్నాను.
నా కళ్ల తలుపులు మూసేశాను.
కలాన్ని పడుకోబెట్టాను.
మనసుమాత్రం
లోలోన మాట్లాడుతూ ఉంది.
ఎక్కడ ఏ సంఘటన జరిగినా
అది అనుకూలంగానో ప్రతికూలంగానో
తన స్పందనలను తెలియజేస్తూ ఉంది.
కారుమబ్బులు గాండ్రించి ఉరిమినప్పుడు
‘‘అయ్యో ఉరుముల మధ్య
మెరుపులు నలిగిపోతున్నాయే’’ అని
ఆక్రోశిస్తున్నది మనసు.
తెగ ఊగే రెండు కొమ్మల మధ్య
ఇరుక్కుపోయిన
ఊర పిచ్చుకలు కిచకిచమంటుంటే
మనసు ప్రగాఢ హాహాకారాలను
ప్రకటిస్తున్నది.
జలధి తరంగాలు హోరెత్తి సాగిపోయి
చెలియలికట్టను
తమ కొసవేళ్లతో నిమురుతూ ఉంటే
ఆ సన్నివేశంతో మనసు
తన పారవశ్యాన్ని శ్రుతి చేసుకుని
పాడుకుంటున్నది.
తాను పొందుతున్న అనుభవాలను
పంచుకునేదెవరా అని మనసు
పడుకున్న నా కలం వెన్ను తట్టింది.
కలం నిటారుగా నిలబడి
నా చేతి వేళ్లలో దూరింది.
అది చూసి పులకించిపోయిన
మనసు తనకు కలిగిన అనుభూతులను
అక్షరీకరించి ఆత్మతృప్తి పొందింది.
నిశ్శబ్దంగా ఉండాలనుకున్న ఈ నేను 
నన్ను పలికించిన మనసును
అభినందించకుండా ఎలా ఉంటాను?

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌