వేచాను కలకై

  • 117 Views
  • 0Likes

    దార‌ల‌ విజయ కుమారి

  • తిరుపతి.
  • 9177192275

రాత్రి వికసించిన కొన్ని
కలల మొగ్గలు
తొలి వేకువలో ముఖంపై
చిరునవ్వుల పరిమళాల నద్దుతాయి
అసంపూర్ణ ఆలోచనా చిత్రపటాలు
నిదుర కుంచెతో
స్వప్నాలుగా గీయబడతాయి

ఆదమరచిన ఏ వేళనో
మనసు తుట్టెను కదపితే 
ముసురుకున్న కలల ఈగలు

వెన్నెలను రాసిమ్మని
వేకువను దోసిలిలో నింపమని
సంధ్య రంగులను సందిట్లోకి దోపమనో

కలవరపెట్టే ఆ కలలను
నిషేధించడం కనులకెప్పటికీ రాదు

కలలకేమో కట్టుబాట్లు వర్తించవు

ఆవిరి మేఘాలైన కలల చినుకులు
చిప్పల్లో కురిసిన ముత్యాలవ్వాలన్న
అత్యాశే.. ప్రతి రాత్రి

నింగి అంచులను పట్టుకు వేళాడితే
కిరణాలతో పాటూ పరుచుకుంటే
సాకారం చేజిక్కుతుందా

తిమింగలాల పాల్చేసిన
ఎడారుల్లోకి విసిరేసిన కలల గురించి ఇక మాట్లాడను

ఇప్పుడే..
ఎదబోను నుంచి విడుదలైన
కలల ఖైదీలు
కాలపు సందుల్లోకి జారిపోతూ..

అలల ఆక్షేపణలున్నా..
తీరం దాటేందుకు త్వరపడుతూ..

కాగితపు పడవలో కలలనెన్నో నింపి..
కాలం కడలి కేసి చూపు నిలిపే ఉంచాను
ఒడ్డుకొస్తే చేరదీద్దామని

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ