స్వాగ‌త గీతిక‌

  • 53 Views
  • 0Likes

    తెన్నేటి శార‌ద‌

  • ఖ‌మ్మం
  • 9948342452

రాయంచల బారులు రంగ వల్లులై
ముంగిట నిలచెనాయనుచు తోచెను 
ముగ్గులు
మనోజ్ఞ కళా విలాసముతో
సంక్రాంతి లక్ష్మికి స్వాగత గీతి పలుకగన్‌!
ఎర్రచెంగల్వ కెరటాలు దాటి వచ్చె
మెట్ట తామర గుట్టుగా వచ్చిచేరె
పచ్చ చామంతి పొత్తిలి వీడెననగా
మెరయుచున్నవి ముగ్గులు ముంగిళ్లలోన
సంక్రాంతి లక్ష్మికి స్వాగతగీతి పలుకగన్‌!
మంచి ముత్యాలు చేజారి చెదరినట్టు
పాల సంద్రపుటల ఇలపైకి ఎగసినట్టు
చంద్రకాంత శిల చిదిమి అలదినట్టు
మెరయుచున్నవి ముగ్గులు ముంగిళ్లలోన
సంక్రాంతి లక్ష్మికి స్వాగతగీతి పలుకగన్‌!
సంజకెంజాయను రంగరించి
హరితవర్ణంపు పర్ణముల నమరికగనద్ది
వెండి వెన్నెల జాలు వేడుకగ కొసరి
ముద్దుగుమ్మలు ముగ్గులు వేసినారేమో
సంక్రాంతి లక్ష్మికి స్వాగతగీతి పలుకగన్‌!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ