బాల్య‌పు సంక్రాంతి

  • 54 Views
  • 0Likes

    పాలపర్తి హవీలా

  • ఖమ్మం
  • 7095479617

గుర్తొస్తే బాల్యపు సంక్రాంతి
వర్తమానం అవుతుందొక భ్రాంతి
తలపోస్తే బాల్యపు సంక్రాంతి,
మనసంతా ఓ నూతన క్రాంతి.
సామూహిక భోగిమంటల వేడుక
అదో అపురూపమైన వాడుక
ఊళ్లన్నీ, వీధులన్నీ, జనంతో..
తెలికిరణ జాడలు
తూర్పున పొడమే వరకూ.
భోగి సందెమ్మకు తూర్పున
వేగు పొడిచే వరకూ.
ఉదయాన్నే తెలుగిళ్లల్లో
చెరకు పొంగలితో
భోగి పొంగిపోయేది.
పులిహోర, పరమాన్నంతో
సంక్రాంతి పరవశించేది.
‘కనుమన తినాలి మినుము’ అని
నానమ్మ గారెలొండేది.
ముగ్గుముత్యాలతో వీధిమురిసేది.
ఆ పల్లె పట్టుకొమ్మల్లో
శుభక్రాంతి వెల్లివిరిసేది.
దూరంనుంచీ బంతుల తోటన
రంగుల చాళ్లు లెక్కించే బాల్యం 
మల్లెగులాబీ తోటల్లో చొరి
సువాసనలాఘ్రాణించిన వైనం
పిల్లలమంతా ఒక దరిచేరి
వీరి... వీరీ.. గుమ్మడులాడీ...
రంగుల గురిగింజలేరీ ఏరీ,
చెరకుతోపులో దాగుడు మూతలు
చెరకుల తడికి ఆరని మూతులు
చెరువు గట్టున ఆడిన ఆటలు
గాలికి ఊదిన జమ్ము కంకులు
నీటిపై తూనీగ బారులు
అందీఅందని నల్లబాతులు
తెల్ల గులాబీ రంగుల కలువలు
కోయడానికై అలసిన తనువులు
పావులూరు, నాగళ్లల్లోన
సంకురాత్రి తిరునాళ్లల్లోన
చెక్కగుఱ్ఱమూ.. చక్కెర చిలకలు
బందరు మిఠాయి.. బూందీలడ్డూ..
జడకోలాటం, తప్పెటగుండ్లూ..,
నల్లని చెరకులు, మలెల్ల చెండ్లూ..,
జాతి సమైక్యతకద్దం పట్టిన
మన తెలుగింటి ఎద్దుల తీరు,
పోటీల కోసం దారుఢ్యంతో..
బారులు తీరిన గిత్తల జోరు
గుర్తొస్తే, బాల్యపు సంక్రాంతి,...
మనసంతా.... ఒక నూతన క్రాంతి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు