నేను-అరిషడ్వ‌ర్గాలు

  • 259 Views
  • 81Likes

    ప్రసాద్‌ కేశనకుర్తి

  • గల్ఫ్‌.
  • 2508882018

నన్ను కోపం హెచ్చరించింది,
నేేను పెచ్చరిల్లితే నిన్ను దహిస్తాను
కామం వణికించింది
నేను పూనితే నీ పరువు తీస్తాను
దురాశ భయపెట్టింది
నాతో సాగితే నీకు దక్కేది దుఃఖం
అసూయ అదిరించింది
నాతో చెంత నీకో పెద్ద చింత
మోహం మందలించింది
నా మీద మోజు నిన్ను నలుపుతుంది రోజూ
గర్వం గడగడలాడించింది
నేను నెత్తికెక్కితే నిన్ను కిందకి తొక్కుతాను 
అయ్యో బాధ! ఎంత బాధ!!
నన్ను భయపెట్టడానికి, హెచ్చరించ‌డానికి,
బెదిరించడానికి, అదిరించడానికి అసలు వీళ్ళెవరూ! అనే
బాధ!!!
పోరాటం! ఎంత పోరాటం!!
కోపాలు, తాపాలు, శోకాలు, మోహాలు,
వీటినుంచి తప్పించుకోవడానికి ఎంత పోరాటం!!!
ఆరాటం! ఎంత ఆరాటం!!
నన్ను నేను తెలుసుకోవడానికి ఎంత ఆరాటం!!!
ఆ ఆరాటం అంతులేని ఆవేదనగా మారి
నిస్సహాయంగా నిరీక్షిస్తున్న క్షణంలో
అంతరంగ లోతుల్లో..
అకస్మాత్తుగా అవతరించింది ఒక అద్భుతం
అది, నాకు తెలిసిన నన్ను 
నిన్నటిలో కలిపేసిన నిముషం
నాకే తెలియని నన్ను 
నూతనంగా నిలబెట్టిన నవ్యోదయం
ఆ నిముషం తర్వాత నాకు అర్థ‌మైంది
ఈ అవలక్షణాలు ఆకాశంలో కదిలిపోయే మబ్బులైతే
నేను మాత్రం
ఆ మబ్బులని నిర్మలంగా, 
నిబ్బరంగా పైనుంచి చూసే ఆకాశాన్ని
ఈ దుర్బుద్ధులు మనసుని దర్శించే సందర్శకులైతే
నేను మాత్రం ఆ మనసుని ఉత్తేజపరిచే 
నిత్య చైతన్యాన్ని
ఈ అరిషడ్వ‌ర్గాలు ఊపిరితో పాటు
ఊడిపోయే ఉలిపిరిలైతే నేను మాత్రం
అంతం లేని అనంతాన్ని
శబ్దం సమసిన నిశ్శబ్దాన్ని

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు