వాన ఊరేగింపు

  • 154 Views
  • 5Likes

    రామవరపు వీర వెంకట రాజా

  • తూర్పు గోదావరి
  • 9059492795

మేఘం రాగమైతే
ఉరుము ఉత్సవమైతే
మెరుపు పుంజాలు పూ లతలైతే
తూనీగ బృందాలు పొలిమేరలో మోహరిస్తే
వాన ఊరేగింపుగా మాఊరొచ్చింది 
చినుకు పూల పావడాలో
వానజల్లు ఓణి వేసుకొని
ఊరు కన్నెపిల్లయిపోయింది
గుడిసె తడిసిన పావురమైంది
చూరులన్ని చిత్ర గీతాలు పాడుతున్నాయి
అరుగులన్నీ తుంపర్ల వజ్ర తునకలతో
మెరుస్తున్నాయి
వానొచ్చి వాకిట్లో నీటి ముగ్గేసింది
పల్లెపడుచు కన్నుల్లో కోర్కెల సిగ్గు లేపింది
వీధులన్నీ నదులైనాయి
పాత పుస్తకం పడవై తేలింది
చిన్నపిల్లాడు చేపపిల్లాడయ్యాడు.
దండెం మీద బట్టలు చెదిరి..
చేతిలో గాలిపటాలైనాయి
నీళ్ళోసుకున్న చెరువు నిండు చూలాలైంది
రైతు చేతులు చినుకులను చేరదీస్తున్నాయి
ఆశల నారుమళ్లకు నీరు పోస్తున్నాయి
ఇలా.. వాన ఊరంతా ఊరేగింది
ఊరి జనం జ్ఞాపకాల్లో హర్షంగా మిగిలింది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు