జీవితమంటే..!

  • 61 Views
  • 3Likes

    జిఎల్‌ఎన్‌.శాస్త్రి

  • అనకాపల్లి.
  • 9492988836

జ్ఞాపకాలకు వేరే వ్యాపకం ఉండదు.
తీరికగా వాలుకుర్చీలో కూర్చున్నప్పుడు.
నా చుట్టూ చేరిపోతుంటాయి.
కొన్ని గొంగళి పురుగులా గజిబిజిగ ఉంటాయ్‌.
కొన్ని సీతాకోక చిలుకల్లా మనసుని రంజింపచేస్తాయి.
కొన్ని చురకత్తుల్లా గాయం చేస్తాయి.
కొన్ని బండరాయిలా గుండెను పిండి చేస్తాయి..
కొన్ని మల్లెపూలలా హృదయాన్ని మత్తులో ముంచుతాయి...
గలగల పారే సెలయేటిలాంటి నువ్వు
నిశబ్దాన్ని ప్రేమిస్తున్నావేమని ప్రశ్నిస్తాయి.
నేను అదిలించి పంపిచేస్తాను.
అయినా అవి నన్ను వదలవు.. కదలనీయవు.
అయితేనేం... అవి నాకు తోడూ 
నేను వాటికి నీడ. ఇదే జీవితం. 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ