ఎదుగుతున్నప్పుడు

  • 147 Views
  • 2Likes

    ఎన్‌.వి.రత్నశర్మ

  • హైదరాబాదు.
  • 9866376050

గుండెల నిండుగ ఆత్మవిశ్వాసం
వెన్నుదన్నుగ అంతులేని శక్తి
ముందుకు నడిపిస్తాయేమో!
మాటల్లోను, చేతల్లోనూ
లెక్కలేని తనమేదో జొరబడి
మనసు అతి విశ్వాసం ఒలకబోస్తుందేమో!
రెక్కల గుర్రమెక్కి
కలల ప్రపంచాన్నిచుట్టి వచ్చినట్లు
గారడీవాడి మంత్రదండానికి
కోరినవన్నీ దొరికినట్లు
ఆకాశంలో చంద్రబింబం
అరచేతికి చిక్కినట్లు
అన్నీ అలౌకిక, అతిశయ దృశ్యాలు!
బలవంతులు చలిచీమలైనట్లు
మన వెనుక పదిమంది ఉండి
పిలిస్తే పలుకుతున్నట్లు
అధికారం జేబులో ఆస్తి అయినట్లు,
సముద్రపుటిసుకలో పాదాలు కూరుకుంటున్నట్లు
ఊహల్లో మనసు కూరుకుంటుంది.
వెలితికుండ తొలికినట్లు
ఏదో ఒక తడబాటు
ఒక కుదుపు కుదిపి
నిన్ను కిందికి తోస్తుంది.
అప్పుడొక కలలోంచి మేల్కొన్నట్లు
లేవటం నీవంతవుతుంది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నేను-అరిషడ్వ‌ర్గాలు

నేను-అరిషడ్వ‌ర్గాలు

ప్రసాద్‌ కేశనకుర్తి


చిత్ర పటం

చిత్ర పటం

అనపర్తి సీతారామ్


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


గ‌ల్లా పెట్టె

గ‌ల్లా పెట్టె

డా।। చిట్యాల రవీందర్‌


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


మరో విత్తు

మరో విత్తు

వేంకటరమణ వెలపర్తి