ఎన్నిక‌లైపోయాయి

  • 421 Views
  • 0Likes

    నడిమింటి నవీన

  • హైదరాబాదు.
  • 9912348206

బిడ్డ వేరైపోయింది!
తల్లికి పునర్జన్మ!
సూర్యుడు కొత్తగా ఉదయిస్తాడు.
పాత సూర్యుడే!
మనుషులు కొత్త దుస్తులు ధరిస్తారు.
పాత మనుషులే!
అందలం ఎక్కినా, 
అంధకారంలో స్రుక్కినా,
అంతరంగం అట్టడుగున
అందరమూ మానవులమే!
కాలం కొందరిని నేతలను చేస్తుంది,
ఇంకొదరి తలరాతలు మారుస్తుంది, 
చూపుడు వేలి గోరుమీద ఇంకుచుక్క
ఇప్పుడప్పుడే చెరిగిపోదు,
పెంచుకున్న ఆశలు
ఇప్పుడప్పుడే ఆవిరైపోవు
ఎన్నికలై పోయాయి
‘ఓటు’ పడవెక్కి ఒడ్డు చేరిన వాళ్లని
విజయానందం గాల్లో తేలుస్తుంది.
బాధ్యతల బరువు
నేల మీద నిలబెట్టాలి.
అరచేతిలో వైకుంఠాన్నీ
కలల్లో ఇంద్రధనుస్సుల్నీ
ప్రదర్శించిన ఐంద్రజాలికులు
ఇకనైనా పాలనని లాలనగా చేయాలి
తమని గెలిపించిన సామాన్యుణ్ని
తాము గెలిపించాలి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత