(ని)వేద‌న‌

  • 53 Views
  • 2Likes

    ఆర్‌.వి.చలపతి

  • వెల్లూరు, తమిళనాడు
  • 8754185630

గతిలేని దానిగా కసుగడ్డి పువ్వుగా
జీవించుమంటు శాసించినావు
నా స్వామి! ఒకరికైన నుపకరించని
వ్యర్థ జన్మము బరువయ్యెనాకు
కడకు నీ చరణ పంకజ పూజకును సొక్కి
సేవింపనైన నోచినది లేదె
ఏమి పాపమ్ముగావించి ఏ శాపమ్ము
తగిలి ఈ రూపమ్ము దాల్చినానో!
ధరణి దయలేని నరుల పాదముల కింద
మణగి రోదించుచున్న నా మనసులోని
వేదనాభారమది ఒక్క వేకువైన
ఓర్వలేనయ్య తండ్రి నేనోర్వలేను!
మల్లెపూవును కాను, చేమంతినైన
కాను, సంపెంగ మరి గులాబీని కాను
పెరటితోటలో నన్నుంచి పెంచలేరు
మానవులకేల కల్గు నాపైన కరుణ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కృష్ణం వందే!!

కృష్ణం వందే!!

పేరిశెట్ల శివకుమార్


రీస్టోర్‌ చేసుకోవాలి

రీస్టోర్‌ చేసుకోవాలి

దాసరి చంద్రయ్య


మెతుకు

మెతుకు

- ఈతకోట సుబ్బారావు


చెమర్చిన కళ్లు

చెమర్చిన కళ్లు

గంజాం భ్రమరాంబ


ఇక మౌనం నా వల్లకాదు

ఇక మౌనం నా వల్లకాదు

సుసర్ల జయభారతి


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం