మనిషి అమరుడు

  • 77 Views
  • 0Likes

    సాహితీ స్రవంతి


ఇలా మిగిలాం!
కాలమనే సంద్రం మీద 
పోరాడి గెలిచిన ఒంటరి నావికుడిలా
మరో యుద్ధం కోసం నిరీక్షిస్తున్నాం
ఇప్పుడీ జలసంద్రాలన్నీ
సలసలకాగుతూ...
మాకింకా సత్తువుందని చెబుతున్నాయి
శీతల పవనాలన్నీ
మెచ్చుకోలుగా బాహువులను తాకుతున్నాయి
నిజానికి! 
మేం నడిచొచ్చినదారి
ఎడారి అంటే ఒప్పుకోము
నెత్తుటి మరకలతో పగిలిన
దారులన్నీ
దీనంగా చూస్తే సహించలేం
మాస్క్‌ విప్పి ఇప్పుడిప్పుడే 
అద్దంలో కాదు
ఆకాశం వంక చూస్తుంటే 
యావజ్జీవ ఖైదీ తాలూకు నిర్వేదం... నిరాశ
మా ముఖాలపై వాలడం లేదు
బాధల సిలువని
ఇప్పటికీ మోస్తున్నామని దిగులు 
మబ్బుతెరలిప్పుడు మా కవసరంలేదు 
ఎన్ని తెగటారిపోయాయో...
ఎన్ని జీవాలు కడతెరిపోయాయో...
తుపాను విడిచిన తీరం
ఎంత క్రూరంగా ఉంటుందో!
మహా యుద్ధమేదో శాంతించిన చోట
విలాపగీతాలు 
భగవద్గీతలు కర్తవ్యం వైపు నడిపించడానికే కదా!
ఇన్నాళ్లూ...
ఎవరికి ఎవరూ కాకుండా పోయాం!
ఓదార్పుకు కరవైపోయాం! 
ఒంటరైపోయాం! 
మనోబలం మందుగా... రోజులనే 
ఏళ్లుగా 
మునగదీసుకుని... కలలు కన్నామా! 
కన్నీళ్లే విడిచామా!
చెప్పుకోవడానికి ..మనసు విప్పుకోవడానికి
ఇప్పుడు ఎవరికి ధైర్యముందనీ!
సంద్రంలో మునకేసిన సూరీడు
తూర్పున పొడకట్టినట్టు
కాలం రక్కసి నిలువునా చీల్చినప్పుడు
బయటపడే యోచన చేసిన 
ఈ మానవ సమూహాలు 
ఇక ఏ ప్రళయానికీ తలొంచవని
నమ్మకమేదో ఇప్పుడిప్పుడే కలుగుతోంది
మనిషి మునుపటికన్నా
శక్తిమంతమయ్యేందుకు మంత్రకవాటం
ఇప్పుడిప్పుడే తెరచుకుంటోంది
వినాశనాలనీ, విస్ఫోటనాలనీ 
నిలువరించేందుకు
మనిషొక్కడే సమర్థుడన్నట్టు
ఆకాశం
భావావేశంతో ఉరుముతోంది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కృష్ణం వందే!!

కృష్ణం వందే!!

పేరిశెట్ల శివకుమార్


రీస్టోర్‌ చేసుకోవాలి

రీస్టోర్‌ చేసుకోవాలి

దాసరి చంద్రయ్య


మెతుకు

మెతుకు

- ఈతకోట సుబ్బారావు


చెమర్చిన కళ్లు

చెమర్చిన కళ్లు

గంజాం భ్రమరాంబ


ఇక మౌనం నా వల్లకాదు

ఇక మౌనం నా వల్లకాదు

సుసర్ల జయభారతి


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం