విషాద చిత్రం

  • 316 Views
  • 3Likes

    పిన్నంశెట్టి కిషన్‌

  • నిజామాబాదు,
  • 9700230310

రెప్పల తలుపులు మూసుకున్నాయి
తలంతా చీకటి శూన్యం
మస్తిష్కం ఏవో అస్పష్టపు చిత్రాల్ని
అంతరంగస్థలం పైకి
ఫోకస్‌ చేస్తోంది
గొంతుక జీరగా పలుకుతోంది
హృదయం కూర్చే విషాద సంగీతపు బాణీ¨ల్ని వింటూ
కన్నీళ్ల తుండుగుడ్డని కనుకొనల్లో ఆరేస్తాను
గుండె చెలిమలో మిగిలిన
ఆ కాస్త తడీ
తొణికిన స్వప్నమై
చెక్కిలిపై జారగా
ఆరిన తెల్లటి
కన్నీటి ధారలు మాత్రం
వెల్లవేసిన గోడపైన
వర్షం చేసిన గాయం మరకల్లా మిగుల్తాయి
రాత్రుళ్లు
నాతో గడిపిన ఒంటరితనం
చేదు జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ
వేకువ జామున
నా మొహంపై
సాలీడు చిత్రాల్ని గీసి వెళ్తుంది.
ఇక యాంత్రిక జీవన విషాదాన్ని
భుజాన వేసుకుని
విధుల వీధుల్లో విహరిస్తాను
చీకటి దుప్పట్లోకి
సూర్యుడు దూరేవరకు
కాలం కుడితినీళ్లలో పడి
మరో రోజు మునుగుతుంది.

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నేను-అరిషడ్వ‌ర్గాలు

నేను-అరిషడ్వ‌ర్గాలు

ప్రసాద్‌ కేశనకుర్తి


చిత్ర పటం

చిత్ర పటం

అనపర్తి సీతారామ్


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


గ‌ల్లా పెట్టె

గ‌ల్లా పెట్టె

డా।। చిట్యాల రవీందర్‌


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


మరో విత్తు

మరో విత్తు

వేంకటరమణ వెలపర్తి