వర్ణచిత్రాలు

  • 438 Views
  • 0Likes

    - కటుకోఝ్వల రమేష్‌

  • ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
  • 9949083327

కన్నీటి తడిలో
ఘూర్ణిల్లుతున్న దేహం
ఇప్పుడిప్పుడే 
విత్తనమవుతోంది
మట్టివాసనల ధైర్యాన్ని పులుముకుని
బలంగా మొలకెత్తుతోంది
జీవన్మరణ సమస్యలు
శాఖలు శాఖలుగా విస్తరిస్తున్న క్షణాన
మానవీయ రేఖల్ని
అడ్డంగా చీలుస్తూ
ఓ విత్తనం పెత్తనం చేస్తోంది
రెండు ధ్రువాల్ని కలిపే
అంతస్సూత్రం కోసం
అన్వేషణ కొనసాగుతోంది
నిరంతరం కదలాడే దేహాల కోసం
మనసును గడియారం చేసుకొని
క్షణక్షణం తిరగాల్సిందే నేమో!
జీవితం ముక్కలు ముక్కలుగా రాలుతున్నప్పుడు
గుండె చెమ్మగిల్లుతున్నప్పుడు
నిప్పులా కణకణ మండే ఆక్రోశం
కొత్త బతుకును పచ్చగా తొడుక్కుంటుంది
కొత్త ఆయుధాన్ని వెచ్చగా ధరిస్తుంది
దళాలు దళాలుగా
మొలకెత్తుతున్న ఆవేశం
అజ్ఞానంగా ఒరిగి పోయినప్పుడు
జ్ఞానం తులసీదళమై చిగురిస్తుంది.
సంస్కృతి ఆనవాళ్లు నిండుగా పూజిస్తాయి
చైతన్యాన్ని గర్భీకరించుకున్న మెదళ్లన్నీ
ముసలితనాన్ని తొడుక్కున్నా
నిత్యయవ్వన శిఖరమై వర్ధిల్లుతాయి
నిశ్చలంగా నిర్భయంగా 
నగ్నత్వాన్ని పూస్తున్న మనసులపై
శతకోటి చూపులు బాకులౌతాయి
నైరూప్య చిత్రంలా
దోబూచులాడుతున్న నిజాలన్నీ
మనోఫలకంపై
వర్ణచిత్రాలవుతాయి!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్