చిగురు వెలుగు

  • 182 Views
  • 0Likes

    నల్లా నరసింహమూర్తి

  • తెలుగు అధ్యాపకులు,
  • అమలాపురం.
  • 9247577501

చిగురు
వెలుగుల వెనుక చినుకు స్పర్శ
చిగురిస్తుంది
అమ్మపాటలా
మట్టి పరిమళం నుంచి ప్రవహిస్తున్న
హరివిల్లు చిగురు
తోటలో ఆనందాల పాటలు
చిగురు బాటలు
సీతాకోక చిలుకకు భరోసా
చిగురు చినుకులో
తడిసిపోతున్న పువ్వుల నవ్వులు
తోటకే అందాన్నిస్తుంది
కొత్త అనుభూతుల్లో
మనసులో మౌన సౌరభాల వెల్లువ
చిగురును చూస్తే
ఎటో ఎగిరిపోయిన సీతాకోక
మళ్లీ
చిగురు తోటలో 
పువ్వుల హృదయాలపై బృందగానం చేస్తోంది
ప్రతి ఉదయం
హృదయంలో చిగురు సంకీర్తన
చీకటిని తొలిగిస్తూ
దీపాలు వెలుగు జ్ఞాపకాలు 
కాలానికి వీలునామా
పక్షిపాటకు
చిగురు నిద్రపోతోంది ఆత్మీయంగా
గాలి ఊయలలా
కొత్త దృశ్యం
కళ్లలో చైతన్యాన్ని కలిగిస్తోంది
చూసే కళ్లకు మనసు అద్దమైతే
అందులో
చిగురు అదృశ్య చైతన్యాన్ని
రెప్పలకు అంటకుండా నింపుతోంది
గాలి పరవళ్ల మధ్య మౌనరాగం
ఆకాశంలో నక్షత్రాలై
రాత్రి చిగురు వెలుగులు చిమ్ముతోంది
చిగురు ప్రతీరోజూ తోటలా
ఎగురుతున్న జెండా
చిగురు గుండె నిండా
వాన వాసన పురిటి వాసనలా
కొత్త జ్ఞాపకంలా నిద్రిస్తోంది
మొగ్గ వికసించినప్పుడు
చిగురుకు ఆనందం
తోటంతా
సువాసనల చలువ పందిరి
గుండెలో చిగురు పడవ
పువ్వుల నదిలో సుగంధం చిందిస్తూ
ఆత్మీయానుబంధాల కవి సమ్మేళనం
రోజంతా
చిలకల అనుబంధంలో
చూపుల పలకరింపులు
అనుభవాల అనుభూతుల్లో
చిగురుదీపమై వెలుగుతోంది
మట్టిలోకి మళ్లీ ప్రయాణం
వేరు నడక నడుస్తోంది
ప్రతి ఉదయం కంటికి కనిపించకుండా
చిగురును గెలిపిస్తోంది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నేను-అరిషడ్వ‌ర్గాలు

నేను-అరిషడ్వ‌ర్గాలు

ప్రసాద్‌ కేశనకుర్తి


చిత్ర పటం

చిత్ర పటం

అనపర్తి సీతారామ్


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


గ‌ల్లా పెట్టె

గ‌ల్లా పెట్టె

డా।। చిట్యాల రవీందర్‌


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


మరో విత్తు

మరో విత్తు

వేంకటరమణ వెలపర్తి