అమ్మ ప్రేమ పండగ

  • 333 Views
  • 4Likes

    శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

  • హైదరాబాదు.
  • 8008224099

ఇక లెగవే.. పండగ పూట ఇప్పటిదాకా పడుకుంటారా! అని అమ్మ కసురుతుంటే..
అక్కడెలాగూ కుదరదుగా, కాసేపు పడుకోనీవే! అని నాన్న నచ్చజెబుతుంటే..
వంట గదిలోంచి అమ్మ గాజుల చప్పుడు ప్రేమగా చిరాకుపెడుతుంటే..
మరిగిన పాలు కాఫీ పొడితో కలిసిన పరిమళం మనసును తట్టిలేపుతుంటే..
లేస్తే ఆ మధురానుభూతులన్నీ చెదిరిపోతాయేమోనని సందేహం

భోగి మంట కాడ కాసిన నీళ్లు తెస్తా.. కాస్త నలుగుతో తలంటుకోవే
అమ్మ ప్రేమలోనూ చాదస్తం కనిపిస్తోందేంటో!
మరగ కాచిన నీళ్లతో మెదడుకు పట్టిన మకిలి వదిలించేయాలేమో మరి! 
తడిసిన తల తుడిచి అమ్మ సాంబ్రాణి పొగేస్తుంటే
గుర్తొస్తోంది కుంకుడుకాయ పులుసు కళ్లలో పడి ఏడ్చిన బాల్య జ్ఞాపకం

మినప సున్నుండే మొదట తినాలి..
ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ పెట్టిన రూల్‌
సున్నుండలోని కమ్మదనం అమ్మను మరిపిస్తుంటే
పరమాన్న మాధుర్యం, పులిహోర కమ్మదనం
తెలుగింటి పిండి వంటల వైభోగాన్ని కళ్లకుకడుతున్నాయి

ఈ చిలకాకుపచ్చ చీర నీకు బాగుంటుందని కొన్నానమ్మా
అరిసె తినమ్మా.. జంతికలు బాగావచ్చాయే... ఒకటి తినరాదూ
అమ్మ ప్రేమకు అంతెక్కడ?
పోనీ వేడివేడిగా పకోడీలేయనా?
నీకిష్టం కదా, అరటికాయ బజ్జీలు వేయనా?
చాలమ్మా, నీ మాటలకే కడుపు నిండిపోతోంది

ముక్కనుమ రోజు మన వాటా ఏట మాంసంతో పాటు
ఇంకెవరన్నా అమ్మితే ఇంకో వాటా కొనుక్కురండి
పిల్ల కిందటేడు ఏటమాంసం పలావు బాగుందని అంది
ఈసారి కూడా చేసిపెడతా.. నాన్నకు ఆర్డరేస్తున్న అమ్మ
నిన్ను మించిన నలభీములెవరమ్మా!

పండగ ముగిసి అత్తారింటికి బయల్దేరే వేళయ్యేసరికి
అమ్మ కళ్లలో నీటి తెర
ఇంకో రెండు రోజులుండమ్మా అల్లుడుగారికి నాన్న నచ్చజెబుతాడులే
బతిమాలుతున్న అమ్మను చూస్తుంటే
ఎందుకమ్మా బిడ్డలంటే ఇంత ప్రేమ అనాలనిపించింది
కానీ అమ్మను ఆ మాట అడగకూడదని గుర్తొచ్చింది
ఎందుకంటే అమ్మంటేనే పండగ
అమ్మతో ఉండటమే పెద్ద పండగ
(పెద్ద పండగకు పుట్టింటికొచ్చిన ఓ తెలుగింటి ఆడపిల్ల మనోగతం)

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


మురళీగానం

మురళీగానం

సుధీంద్ర‌భార్గ‌వ‌