మనసైన వేళలో
ముసిరిన ఊహకు
విరిసిన ఊసుకు
ప్రభవించిన ఉదయని నీవు.
నీ నీడలో,
అడుగడుగులో
ఎంత మోసినా
అలుపురాని నిజం నీవు.
చిక్కని పాలలో
వెచ్చని పాల నరుగులా
చక్కని నవ్వులో
పచ్చని స్వేచ్ఛవు నీవు
విప్పారిన మనసులో
విరబూసిన మమతలా
పురివిప్పిన అందంలో
కళవిరిసిన కాంతి నీవు
మాట లేకుండా మోగే
మౌనం నీవు
పలుకు లేకుండా పల్లవించే
చరణం నీవు
కంటి గూటిలో
పారాడే చంటి పాపలా
ఎదిగే ప్రేమకు
వెలుగు రూపం నీవు
పగలు గీసిన గీతలో
ప్రాణం పోసుకొన్న అందం నీవు
రాత్రులు రాసిన కవితలలో
పొదగబడ్డ ప్రేమవు నీవు