కర్తవ్యం

  • 355 Views
  • 0Likes

    పచ్చా పెంచలయ్య

  • మహమ్మదాపురం, నెల్లూరు
  • 9912822341

భారతమాత బిడ్డలుగ భాగ్యవశంబున పుట్టబట్టియే
ధీరత బొంది లోకమున దివ్య యశస్సును బొందమాతకున్‌
భారపు సంకెలలే చిదిమి బంగరు కాలము తెచ్చిపెట్టి, ఏ 
మారక తల్లి పాదముల ఎప్పుడు కొల్చెడి రోజులొచ్చెగా ।।

త్యాగము, కార్యదీక్షయును, తాత్విక చింతన, దేశభక్తియున్‌
ఆగని దానశీలతయు, అందరు మెచ్చెడి సత్యసంధతన్‌
వేగపు ఆర్తరక్షణయు, వేడుక జూపెడు భావసంపదల్‌
బాగుగ వంట బట్టినని భారతమందున జన్మనందగన్‌ ।।

అట్టి బాటను నడచియు అమరులైరి
ఎందరెందరొ యిచ్చోట ఎఱుక బడుము
వారు జూపిన సద్బుద్ధి వరుసదప్పి
స్వార్థ చింతన పెరిగెను సంఘమందు ।।

దేశ మాతను కాపాడ తిరుగులేని
త్యాగ నిరతిని పాటించి తనువు లొదలి
అమరు లైనట్టి పెద్దలు ఆకసాన
వెలుగుతున్నారు తారలై విధిని తెలుప ।।

తనువున జీవమున్నతరి తప్పక దేశపు బాగు కోసమై
అనువగు దేశభక్తియను ఆరని జ్యోతిని చేతబూని, నీ
వనమయ మునిల్చునప్పుడెగ వచ్చును కీరితివాంఛ దీరగన్‌
తనువున కబ్బు సార్థకత తప్పక అప్పుడె జన్మ జన్మకున్‌ ।।

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత