జ్ఞాపకం

  • 1063 Views
  • 2Likes


ఈ నగరం నిద్దురపోదు
ఇది చీకటి వెలుగుల తోడు.
ఈ మనసుకు నిద్దుర రాదు
ఇది ముసిరిన ఊసుల గోడు
కత్తులు దిగబడి నెత్తురు చిందినా
ఈ గుండెకు ఆ తడి అంటదు.
విరజాజి సుగంధం మల్లెల అందం
మనసు పొరల్ని తాకదు

అగ్గిపెట్టెల్లా ఇళ్లు
ఇరుకు లోగిళ్లు
మనసు వాకిళ్లు
ప్రపంచాన్ని పరికించే కేబుల్‌ కళ్లు
జ్ఞాపకాల్లో ఊళ్లు
ఘనీభవించిన జ్ఞాపకాలు
నిద్దురలేని రాత్రులు

- ఆదిత్య, హైదరాబాదు

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌