తెలుగు తల్లి

  • 879 Views
  • 2Likes

    - డా।। నాగభైరవ ఆదినారాయణ

  • గుంటూరు

తెలుగు(ఆంధ్రా) మాతా! నీకు జేజేలు
అవని తల్లీ! నీకు జేజేలు
రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు
రాయలేలిన నాడు రతనాల తేలావు
బాలచంద్రుని ఖడ్గధారలో మెరిసి
నాగార్జునుని రససిద్ధిలో మురిశావు    ।।ఆంధ్రా।।

తిక్కన శ్రీనాథ కవితలో తేనెవై
త్యాగయ్య, అన్నమయ్య గొంతులో రాగమై
కూచిపూడీ నాట్య భంగిమల అందమై
అమరావతీ శిల్ప శోభవై నిలిచావు    ।।ఆంధ్రా।।

కృష్ణమ్మ, గోదారి గలగలలో నీవే
మాగాణి సిరిపంట కళకళలలో నీవే
సంక్రాంతి ముగ్గులో, తెలిమంచు పొద్దులో
మధురిమలు చిందించు విరి చేడెలో నీవే    ।।ఆంధ్రా।।

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత