వానొచ్చింది

  • 1285 Views
  • 0Likes

    గరికపాటి మణీందర్‌

  • మామునూరు, ఖమ్మం
  • 9948326270

రాత్రికి
వానొచ్చింది
నింగి నుంచి నేలపైకి 
వెలుగు వాగు పొంగింది.

ఆకాశాన్నెవరో
బాంబులతో పేల్చినట్టు
మేఘ సమూహం ఒక్కసారి
కూలినట్టు
రెండు గంటలపాటు తీన్మార్‌ ఆడింది.

చెట్లు ఆకులు ఓణీలు జారిపోతుంటే
నిలువెల్లా పరవశిస్తూ నాట్యమాడాయి
మంచంపైన ముసలి ప్రాణాలు
మారాకు తొడిగాయి.

రోడ్ల పక్కన గుల్మొహర్లు 
రంగుల వేడుకకు సిద్ధమైనాయి
మట్టిపొరల గింజల స్వప్నాలు
పచ్చటి సీతాకోకలైనాయి.

వానొచ్చింది
వీళ్లెవరో
పిల్లాళ్లలా
సంబర పడుతున్నారు
మొయిళ్ల నుంచి జారిన ఆశలను
ఏరుకుంటూ
సరంజామా సర్దుకుంటూ
నాగళ్లు మరమత్తు చేసుకుంటున్నారు.

కాకి 
ఎద్దులపై వాలి
అర్రుమెడపై పుండును వెతుకుతోంది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత