ఒప్పుకుంటావా?

  • 47 Views
  • 0Likes

    రాళ్లబండి శశిశ్రీ

  • హైదరాబాదు.
  • 7416399396

నిన్ను కూడా జతకలుపుకొనే వెళ్లినా,
ఎంతోకొంత నీ పక్షానే నిలిచినా
నన్ను విడిచి నేనెప్పుడూ వెళ్లిపోలేదు
నిజమే:
ఆశించడంలో నెమ్మదిగా
ఒకరివైపునకి ఒకరు ఒరిగిన ధ్యాసే ఉండదు
అసంకల్పితమో సంకల్పితమో
ఆధీనం కాలేనిదేదో పేచీ అవుతుంది:

కళ్లల్లో ఎర్రజీర
కంటినుంచి రాలిపడిన ఉక్రోషం
నిజాన్ని దూరంచేసి
చుట్టూ ముట్టడిచేసే అభద్రతా భావం
నిబంధనల మధ్యే 
వారధులు కట్టుకునేవాళ్లం
అతినమ్మకంతో ఆవలి ఒడ్డుకు చేరలేం

మనకి పరకాయ ప్రవేశమే తెలిసుంటే
పరాయివాళ్లం అయ్యేవాళ్లం కాదేమో?!

మరి ఒప్పుకుంటావా?
కొత్త భాష్యాలు చెప్పటానికి
ఎన్ని మాటలు నేర్చినా,
మనసు ఒప్పించలేని చోట
నువ్వు బలహీనురాలివని!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి

మట్టి

వి.సూర్యారావు


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌


ఊహల వాన...

ఊహల వాన...

జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి


కడతేరి పోతివా

కడతేరి పోతివా

చిన్నం అశోక్


వ్యథార్థము

వ్యథార్థము

- వల్లూరు దాలినాయుడు,