పఠితగా

  • 1389 Views
  • 1Likes

    డాక్టర్‌ సి.నారాయణరెడ్డి

  • హైదరాబాదు
డాక్టర్‌ సి.నారాయణరెడ్డి

మనసు తననే వేదికగా చేసుకుని
సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నది.
జనం సమక్షంలో
బహిరంగ ప్రసంగం చేయాలంటే
వినే చెవులు లేవు.
ఎవరికి వారే
ఎలుగెత్తి ప్రసంగిస్తున్నారు.
మనసు శ్రోతల కోసం
అన్వేషణ సాగించింది.
కొద్దిపాటి శ్రోతలు
ఓ క్షణంపాటు విన్నట్టే విని
తమ చెవులు దులుపుకుని
ఆకాశం వైపు చూస్తూ
వక్తలుగా మారిపోతున్నారు.
అనే వాళ్లు తప్ప
వినే వాళ్లు లేని లోకంలో
తాను ధరించిన వక్తృత్వ పాత్ర
వ్యర్థమని అర్థం చేసుకున్న మనసు
శ్రోతగానే ఉండిపోవాలని
నిర్ణయించుకుంది.
అసంఖ్యాక బాహిరంగిక ప్రసంగాలను
ఆంతరంగిక ప్రసంగాలను వింటూపోయింది.
ఆ ప్రసంగాల్లోని వైవిధ్యానికి
పరస్పర వైరుధ్యానికి విస్తుపోయింది.
మనసు తెలుసుకుంది.
వక్తగా ఉన్నా శ్రోతగా ఉన్నా
తన భూమికలకు సార్థకత లేదని.
అది ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది
సువిశాల పృథ్వీమండలం
గుప్తలిపిలో రాసుకున్న
విశేషాంశాల లోతులను పఠించే
పఠిత పాత్ర ధరిస్తానని.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత