కన్నీళ్ల విలువెంత?

  • 47 Views
  • 0Likes

    గుడిపూడి రాధికారాణి

  • మచిలీపట్నం
  • 9494942583

కన్నీళ్ల విలువెంతని
వేచి చూసి విసిగి వేసారి
పగిలిపోయిన గుండెనడుగు
పరుగాపిన సెలయేరులా
స్తబ్ధమై స్థాణువైన మనసునడుగు
ఏడ్చి ఏడ్చి ఎండిపోయి
తడియారిన పెదవులనడుగు

అవి ఎవరివైతేనేం?
కర్షకులు కార్మికులు
శ్రామికులు మహిళలు
పసివాళ్లూ పడుచోళ్లూ
వృద్ధులూ పెద్దలూ

కారణమేదైతేనేం?
నిర్లిప్తత నిస్సహాయత
ఆక్రోశం ఆవేదన
ఉక్రోషం సంతోషం

గుండె మొయ్యలేనప్పుడు
ఆగుతుందేమోనన్నప్పుడు

ఒక్క కన్నీటిచుక్క..
ఒకే ఒక్క కన్నీటిచుక్క..

భారంతీరిన నల్లమబ్బు తేటబడినట్లు
గుండెను కుదుటపరిచే
ఒకే ఒక్క కన్నీటిచుక్క

ఎంత విలువైందో..
రెప్పలవాకిళ్లు తెరచి
ఎదురుచూసే కళ్లనడుగు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి

మట్టి

వి.సూర్యారావు


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌


ఊహల వాన...

ఊహల వాన...

జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి


కడతేరి పోతివా

కడతేరి పోతివా

చిన్నం అశోక్


వ్యథార్థము

వ్యథార్థము

- వల్లూరు దాలినాయుడు,