ధైర్నంగ ఉండుండ్రి

  • 1380 Views
  • 0Likes

    దోరవేటి, (వి.చెన్నయ్య)

  • హైదరాబాదు
  • 9866251679
దోరవేటి, (వి.చెన్నయ్య)

ఇతునాలు దొరుకలే దెంతగీమాడినా
దొరికె ఆఖరుకెంతొ పిరెముగాను;
కూలికెవ్వరు రాక కొంపలో వాళ్లమే
కష్టించి విత్తంగ గలిగినాము;
తొలిగాల మెకువయ్యి కలుపు ఎక్కువ వడ్తె
ఎకువ రేటుకు గుత్తకిచ్చినాము;
సరియైన సమయాన్కి కురువకపాయెగా
వాన ఏ దేశాన్కి వాయెనేమొ!
వాన లేకున్న పురుగులు వాటమైతె
మందు గొనుకొచ్చి కొడ్తిమి మల్లమల్ల
పెట్టువడి వెర్గె యాదన్న గుట్టల్యాక
కల జెదిరిపాయె, మిగిలింది కంటనీరె!
ఎనుకటికి ఎవని సాయము
మనకాదెరువవుతదాని మనసులనైనన్‌
అనుకొనలే దెపుడైనను
తినకున్నను, కష్టమెంత తివురంబైనన్‌
అమ్మ నాయ్నతోడి, అన్నదమ్ములతోడి
ఆలువిల్ల తోడి అంతగలిసి
ఇరువయైదు మంది మెవని ఆసర లేక
పనులు జేసుకున్న ఘనత మాది!
కాని ఇప్పుడు...
ఒంటి బతుకులాయె, ఒగ తోడు లేదాయె
పెయిల బలము తరిగె, ఫికరు వెరిగె
లక్షదాకవట్టె లాగోడి, ఖర్చులు
ఆముదాని జూడ అయిపు లేదు
మారిన కాలమెంత అవమానము జేసినగాని కష్టమే
మారక జేసి ఇప్పుడు సుమారుగ జీవిక గడ్పుకుంట; ఈ
తీరును ముందటేడయిన దేవుడు మార్చకపోడు; అప్డు వి
స్తారముగాగ పంటలను దక్కగ జేసుక ఉండ జాలనో!
భూమి పుత్రులార! పుణ్యాత్ములార! ఈ
కరువు బరువు జూసి వెరువకుండ్రి!
నారువోసినోడు నీరిచ్చు రేపైన
దైర్నమిడువకుండ్రి! దండమెడ్త!
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత