తిలకం

  • 320 Views
  • 0Likes

    ముకుందాపురం పెద్దన్న

  • అనంతపురం
  • 9052964771

అమ్మా...
నీ ఓనమాల ఉగ్గుపాలతో
ఊపిరి పోసుకున్న వాళ్లం.
నీ పదాల గోరుముద్దలతో 
వాక్యాలుగా ఎదిగిన వాళ్లం.
ఆమని కోయిలలు
పద్యాల సుమాలతో
నిన్ను అభిషేకిస్తుంటే
ఎగిరి గంతులు వేసిన వాళ్లం.
నీ తలుపు ముంగిట
సుతారంగా వాలిన కావ్యపక్షులు
వచన కవితాహారాలతో
నిన్ను అలంకరిస్తుంటే
కేరింతలు కొట్టిన వాళ్లం.
మోదుగ- గోగు
తంగేడు- తుమ్మ పూల కలాల కరచాలనంతో
ఏ తల్లినైనా
కన్నతల్లిగా గౌరవించే వాళ్లం. 
కానీ,
నీ పదాలు పెదాలు దాటితే చాలు
రూపాయి గింజలు మేసే నల్లపక్షి
అపరాధ రుసుం గోళ్లతో
గాయాల గేయాల్ని రాస్తోంది.
అందుకే...
లేత శరీరాలకు కవచాలై
జాతి డేగలు కౌగిళ్లు పరచాలి.
ఆ రెక్కల పందిరి కింద
మా పసితనం మొగ్గలు తొడగాలి.
అలకలు లేని ఆటల్లో...
పంతాలు లేని పాటల్లో...
వెలుగు రేకులై పల్లవించాలి
నీ నుదుటి తిలకంలా...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత