నా హృదయం

  • 333 Views
  • 0Likes

    టి.శ్రీవల్లీ రాధిక

  • హైదరాబాదు
  • 9441644644
టి.శ్రీవల్లీ రాధిక

ఏమీలేదనుకుంటే...
దానికన్నా పనికి మాలింది లేదు
రూపం లేదు.. భాషా రాదు
నడవడం తెలియదు... నవ్వీ ఎరుగదు

కష్టాలు తీర్చదు... కరచాలనానికీ అందదు
కానీ అక్కడ నువ్వున్నావనుకుంటే...
అది సహస్ర దళాల సువర్ణ పద్మం
నిన్ను మోస్తోందనుకుంటే...
వేయి పడగల శేషుని రూపం
నువు విహరిస్తున్నావనుకుంటే...
అదే... క్షీరసాగర తరంగం
మహోత్తుంగ హిమశైల శిఖరం
ఒక్కసారైనా నేను కంటితో చూడనిదీ...
నన్ను నిలువునా కోసినా ఎవరికీ చిక్కనిదీ
నా దగ్గరున్నందుకు.. కేవలం నాదైనందుకు...
దానికెంతటి భాగ్యం దక్కిందీ!
ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగిందీ!
లేనిపోని ఊహలతో...
ఇంతటి వైభోగాన్ని నేను దానికి అంటగట్టానా!
చెప్పినట్లు విని...
భరించలేనంత ఆనందాన్ని అది నాకు కట్టబెట్టిందా!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్