సంక్రాంతి లక్ష్మి

  • 810 Views
  • 0Likes

    అద్దంకి రామప్రియ

  • కాకినాడ, తూ.గో.
  • 9640943342

వచ్చెనే సంక్రాంతి లక్ష్మి
తెచ్చేనే నవధాన్యలక్ష్మిని    ।।వచ్చెనే।।
పైరు పచ్చని చీరకట్టి
బంతిపూవుల రైక తొడిగి
పల్లెపడుచులు పదాలు పాడ
వయ్యారి నడకల నాట్యమాడుచు ।।వచ్చెనే।।
వేకువను సాతాని జియ్యరు
మేలుకొలుపులు పాడగా
బసవన్నలూ సన్నాయిమేళము
వేడుకగ స్వాగతము పలుక    ।।వచ్చెనే।।
భోగిమంటల దివ్యకాంతి
జ్ఞానకాంతుల చిమ్మగా
పరవశంతో ఆడిపాడే
ఆబాలగోపాలమ్మును చూడగ    ।।వచ్చెనే।।
రంగవల్లులు తీర్చిదిద్ది గొ
బ్బెమ్మలను అలంకరించి
చిన్నారులూ చిరునవ్వులా
నాట్యమాడే వేడ్క చూడగ    ।।వచ్చెనే।।
బాలలకునూ దిష్టితీసి
భోగిపండ్లను పోయగా
బొమ్మల కొలువును చూసి
ఆనందముగ హారతుల్విగ    ।।వచ్చెనే।।

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత