పొందడం కోసమే..!

  • 810 Views
  • 0Likes

    కల్వలపల్లి బాలసుబ్రహ్మణ్యం

  • మొగల్రాజపురం, విజయవాడ

అప్పుడప్పుడూ వెళుతుంటాను
పల్లె పవనంతో
శ్వాసకోశాలను
శుభ్రపరచుకోవడానికి.
అప్పుడప్పుడూ వెళుతుంటాను
బడి పలక అద్దంలో
నిర్మలత్వాన్ని చక్కదిద్దుకోవడానికి.
అప్పుడప్పుడూ వెళుతుంటాను.
ఆశ్రమ నిశ్శబ్ద సరస్సులో మునిగి,
మౌనమై తిరిగిరావడానికి.
అప్పుడప్పుడూ వెళుతుంటాను
కోవెల వెలుగును, బతుకు లోగిలంతా 
పరుచుకోవడానికి.
అప్పుడప్పుడూ వెళుతుంటాను
పుట్టిన ఊరి మానస కాసారంలో
బాల్యం కాగితపు పడవనై విహరించడానికి.
ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా,
పోగొట్టుకున్న వాటిని పొందడం కోసమే!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌