పావురాళ్లకు కెవ్వు కేకలు

  • 815 Views
  • 0Likes

    కోటం చంద్రశేఖర్‌

  • 9490157320

బైటికెళ్తూ
చెప్పులకి తడి తాకకుండా బట్టలపైకి బురద చిట్లకుండా
ఒక జాగరూకతలో-
బడికెళ్లడానికి
నా శ్వాస నా ధ్యాస
బస్తాలు తీసుకొని; మధ్యాహ్నం లంచ్‌కి బాక్సులు పట్టుకొని-
నది పొర్లుకొచ్చినట్టుగా వాకిలీ రోడ్డూ దాదాపు నీరు-
చూస్తూనే కేరింతలు గెంతులు
చూస్తుచూస్తూనే త్రుళ్లింతలు హన్మంతులు-
యూనిఫామ్లు తడిసినా పాలిష్‌షూలు పాడైనా
నీటి మూటల్ని తంతూ-
కవితాత్మకవాన కళాత్మకవాన
రమణీయవాన రసమయవాన నీటితో
చిలుకల ఆనందం గోరింకల ఆహ్లాదం-
గొడుగు అక్కర్లేదు
అడుగు ఎటుపడ్తుందో భయంలేదు-
నాకసహనం; లేళ్లకి సాహసం
నాకు విరక్తి; నెమళ్లకి అంతులేని ఆసక్తి
నాకు తడిస్తే బట్టలు మురికైతే ఆత్మాభిమానం విలవిల
కుందేళ్లకి మెరిసే కన్నుల మిలమిల-
సన్నచినుకులకే లేతచినుకులకే జలుబవుతుందని
భద్రతలేనట్టు రక్షణ కరువైనట్టు
పెడబొబ్బలు చావుకేకలు నావైతే
పావురాళ్లకి కెవ్వుకేకలు-
తరానికి తరానికి అంతరం
ఆలోచనకి అమాయకత్వాన్కి దూరం
బాధ్యతకి బాల్యానికి బహుదూరం

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌