వలపు దీపం

  • 302 Views
  • 0Likes

    ఆర్‌.వి.చలపతి

  • వెల్లూరు, తమిళనాడు
  • 8754185630

వలపు దీపమొకటి వెలిగింది మదిలో!
కలలు కరగనీకుమా! 
కలత చెందనీకుమా!
నిదురమ్మా! నిదురమ్మా! చెదరిపోకుమా!
చెలిని కలను కలిసేవేళ తేలిపోకుమా!

పేదవాని హృదయంలోనూ 
ప్రేమంటూ ఉంటుందనీ
పెదవిదాటి రాలేని పలుకులు దాగుంటాయనీ
చిలిపి ఊహలెన్నో చెలగిపోతుంటాయనీ
వలపు తలపులెన్నో 
తొలచి వేస్తుంటాయనీ
ఎరుగనిదానవా! కరుణలేనిదానవా

ఆదమరచి నిదరోతుంటే 
సుందర తార స్వప్నాలు
అందరాని నా చెలితోటి 
అందమైన అనుభవాలు
కనులు తెరచి మూసేలోగా 
కలలు చెదరిపోతాయేమో
చెలియ అలిగి కనుమరుగైతే హృదయమాగిపోతుందేమో
ఎరుగనిదానవా! కరుణలేనిదానవా
నిదురమ్మా! నిదురమ్మా! చెదరిపోకుమా!
చెలిని కలను కలిసేవేళ తేలిపోకుమా!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి గూట్లో...

మట్టి గూట్లో...

రాజశేఖరుని శ్రీశివలక్ష్మి


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌